పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో ఈ మధ్య వరదలు వచ్చాయి. అయితే వారికి ఆహారం దొరకలేదని కూడా ఆరోపణలు వచ్చాయి. జగన్ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించారు. పోలవరం నిర్వాసితులందరికి తల పది లక్షల రూపాయలు వచ్చేలా చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అదే విధంగా ఎప్పుడు ప్రధాని వద్దకు వెళ్లినా ఆయన్ని పోలవరం నిర్వాసితుల గురించి అడిగానని అన్నారు.


చివరకు నిర్వాసితుల పరిహారం మా ద్వారా వేయొద్దు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిర్వాసితుల అకౌంట్లలోకి వేయాలని కోరినట్లు చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య పోలవరం నిర్మాణ వ్యయం రూ. 14 వేల కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు వెళ్లిపోయింది. టీడీపీ చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జగన్ మాట్లాడుతూ.. పోలవరం టీడీపీ నాయకులకు ఏటీఎంగా మారిపోయిందని విమర్శలు చేశారు. నిర్వాసితుల సంఖ్య 50 వేల మంది కొత్తగా పెరిగారు. అయితే కొత్తగా కాలువలకు సంబంధించి, ప్రభుత్వ భూములకు పట్టాలు పొందిన వారు సైతం నిర్వాసితులుగా మారుస్తూ లెక్కను పెంచేశారు.


అయితే అసలైన నిర్వాసితులు ఎవరూ సంఖ్య పెరగడానికి కారణం ఏమిటని కేంద్ర మంత్రి అడుగుతున్నారు. రూ. 12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధమని నిర్వాసితులు ఎవరు అనే కారణం. ఎలా సంఖ్య పెరిగింది చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మోదీ, జగన్ ఇద్దరు పోలవరం ఏటీఎం అని అన్నారు. కానీ నిర్వాసితుల సంఖ్య అమాంతం పెరగడం వెనక ఉన్న కారణాలు తేల్చే వరకు పోలవరం సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. ఇక్కడి ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వదు. కేంద్రం సరైన రీజన్స్ చెప్పే వరకు నిధులు విడుదల చేయమని అంటారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు అటకెక్కుతాయి. ఇలా కేంద్రం, రాష్ట్రం మధ్య పోలవరం నిర్మాణానికి నిర్వాసితుల అంశం కూడా ఒక కారణమవుతుంది. మరి పోలవరం ఎప్పటికీ పూర్తయ్యేనో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: