మినిమం మూడు లేదా నాలుగు గంటలు తప్పకుండా తీస్తున్నారు. అదే సందర్భంలో కరెంట్ డిపార్ట్ మెంట్ వారు స్పందించడం లేదు. కేవలం వారి పర్సనల్ ఫోన్లకు మాత్రమే స్పందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 100 మందికి 95 మంది సరిగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి సమయంలో కూడా ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇక అంతే సంగతులు.
కరెంట్ డిపార్టు మెంట్ కార్యాలయాల్లో ఇంతకుముందు ఒక టీం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి టీం లు ఉండటం లేదు. 24 గంటల కరెంట్ కు అలవాటు పడిపోయిన వారు.. లైన్ మెన్ లను ఏమీ అనడం లేదు. డైరెక్టుగా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిపై అజమాయిషీ లేకపోవడం కూడా కరెంట్ కోతలకు ఒక కారణమని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో అతి పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది.
కరెంట్ డిపార్ట్ మెంట్ విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు ఆయన ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నిత్యం కరెంట్ 24 గంటలు ఉండడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కామన్ అయిపోయింది. సంక్షేమ పథకాలు ఎన్ని ఇఛ్చారనేది చూడరు. కేవలం కరెంట్ వస్తుందా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే కరెంట్ లేకుండా ఉండటం అసాధ్యమని ప్రభుత్వం జగన్ తెలుసుకుంటేనే రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి