ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికార పక్షంలోనే ఉండి ఒకప్పటి కమ్యూనిస్టుల లాగా ప్రజల తరఫున పోరాడుతున్నాం అని చెప్పుకునేలా ఉండాలని పవన్ ఆరాట పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి మిత్రపక్షంగా పవన్ కల్యాణ్ ఉంటే అప్పుడు ప్రజల్లోకి ఒక భావన తీసుకురావాలని అనుకుంటున్నారు.


పవన్ కల్యాణ్ జగన్ ను అయినా లెక్క చేయడు. టీడీపీనైనా లెక్క చేయడు. ఎందుకంటే ఆయనది ప్రశ్నించే మనస్తత్వం ప్రజల కోసం మాత్రమే పోరాడతాడు అని చెప్పించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. సామాజిక సేవ చేసే వ్యక్తిగా గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాను ఓంటరిగా వెళితే పెద్దగా ప్రయోజనం లేదని తెలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు జనసేన ఆంధ్రలో గెలిచి అధికారం చేపట్టడం అనేది అంతా ఈజీ విషయం కాదు. కాబట్టి బీజేపీని కూడా కలుపుకుపోవాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.


బీజేపీని కలుపుకుపోతే మాత్రం కచ్చితంగా బీజేపీకి ఓటింగ్ శాతం పెరగదు. ఎందుకంటే పొత్తులతో వచ్చే ప్రయోజనం బీజేపీకి సున్నా అనే తెలుసుకోవాలి. గతంలో ఆంధ్రలో కొన్ని సీట్లనైనా ఒంటరిగా గెలిచిన బీజేపీ ఇప్పుడు ఆ మాత్రం సీట్లు కూడా గెలవకపోతే దానికి కారణం టీడీపీతో పొత్తే అని అర్థం చేసుకోవాలి. కానీ పవన్ మాత్రం బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడాను. ఇక టీడీపీ బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని భావిస్తున్నారు.


అయితే ఇక్కడ టీడీపీ లాభపడుతుంది. జనసేనకు 10 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు గెలిచి తన ఉనికిని చాటుకుంటుంది. కానీ సమస్యల్లా బీజేపీకే వస్తుంది. బీజేపీ సొంతంగా ఎదగలేక చతికిలపడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. పొత్తు వల్ల చాలా ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. తద్వారా అక్కడ బీజేపీకి ఉన్న క్షేత్రస్థాయి ఓట్లు కూడా టీడీపీ, జనసేనకు పడటం వల్ల మళ్లీ వచ్చేసరికి అక్కడ కమలానికి క్యాడర్ లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: