టీడీపీ ఇసుక పోరుకు సిద్దమైంది. అయితే దీన్ని అణిచివేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇసుక ఉద్యమానికి పిలుపునిచ్చిన టీడీపీకి ఎదుర్కొవాలంటే వైసీపీ గృహ నిర్బంధాలు.. ఉద్యమాన్ని అణిచి వేయడం చేయకుండా అసలు ఎక్కడ తప్పుంది. టీడీపీ కావాలనే ఆరోపణలు చేస్తుందా? నిజనిజాలు ఏంటి అనే విషయాలను ప్రజలకు చెబితే సరిపోతుంది.


టీడీపీ వాళ్లు చెబుతున్నవి అబద్ధాలైతే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇసుక గురించి వివరాలు ప్రభుత్వం చెప్పాలి. లేదు టీడీపీ వారు చెబుతున్నది నిజమైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో తప్పు చేస్తున్నారో ఆ అధికారులు, దానికి కారకులపై చర్యలు తీసుకోవాలి. ఇసుక తీయడానికి అసలు పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అయితే ఆంధ్రజ్యోతి కొన్ని రోజుల కిందటే ఇసుక పర్మిషన్ గడువు అయిపోయిందని చెబుతూ కథనాలు ప్రచురించింది.


ఇసుక పర్మిషన్ అయిపోయిందని పత్రికలో రాస్తే అందులో వాస్తవం లేకపోతే  అది నిజం కాదు పచ్చి అబద్ధం అని ప్రభుత్వం చెప్పగలగాలి. డబ్బులు, జీఎస్టీ చెల్లిస్తున్నారా లేదా విషయాలను చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పగలగాలి. ఇసుక రేటును  లారీకి, ట్రాక్టర్ కు ఎంత కు ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలను వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది.


కానీ వైసీపీ వాళ్లు ధర్నా చేస్తే ఆపుతాం.. తెలుగు దేశం వాళ్లు అక్కడకి రానీకుండా చేస్తాం. గృహ నిర్బంధాలు చేస్తామంటూ ప్రభుత్వం చెబుతుండటంపై చాలా మంది రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను తీసుకోకపోవడంతో ఎంత సేపు ఆపగలుగుతారు. అణిచివేత ద్వారా అదుపు చేయాలనుకుంటే ప్రభుత్వాలకు తీవ్ర నిరసన తప్పదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఇసుక విధానం ఏమిటి? ఎక్కడ లోపం జరుగుతుందనే వివరాలు చెప్పినపుడే నమ్మకం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: