మరి రాజకీయాల్లోకి వచ్చేసరికి రఘురామ కృష్ణంరాజు ట్రోలింగ్ కి గురి అయ్యే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రఘురామ కృష్ణంరాజుకి ఈ పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అంటుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి మీడియా ఆయనను హైలెట్ చెయ్యదు. కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చేసారు. సాక్షి మీడియాలో ఎలాగూ ఈయన గురించి అనుకూల కథనాలు ఉండవు.
అంతే కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈయనకి జగన్ టికెట్ కూడా ఇవ్వరు. కాబట్టి ఆయన బయటికి వచ్చేసి తనకు అనుకూలంగా ఉండే పార్టీకి సంబంధించిన మీడియా ద్వారా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో భవిష్యత్తు రాజకీయానికి తాను ప్రత్యేక రంగం సిద్ధం చేసుకున్నట్లే. అయితే కేంద్ర ఎన్నికల ఫిర్యాదు సంఘం అనుమానాస్పద ఓట్లు 27 లక్షలు ఉన్నట్లుగా రఘురామకృష్ణంరాజు చెప్పిన మాటను అంగీకరించిందట.
దీంతో ఇదే వార్త అన్ని మీడియాల్లోనూ వైరల్ అవుతుంది. అయితే నిజానికి ఈ 27 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని ఇటు వైసిపి వాటిని ఒక పక్క నుండి తొలగిస్తూ వస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓట్లు, జనసేన పార్టీకి చెందిన ఓట్లు తొలగిస్తున్నారు అంటూ దీనిపై మాట్లాడుతున్నారు ఆయా శ్రేణులు. 2019కి ముందు ఓట్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఆ సమయంలోనే ఈ 27లక్షల దొంగ ఓట్లు నమోదు అయ్యి ఉండవచ్చు అని అంటున్నారు కొంత మంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి