దీనికి చైనా బదులిస్తూ పాక్ తో ఒప్పందం మేరకు ఈ నిర్మాణం చేపడుతున్నాం.. పీవోకే ఇప్పుడు పాక్ ఆధీనంలో ఉంది. దీనిపై పీవోకే ఎవరిదో తేల్చి చెప్పడం లేదు. ఇది అంతర్గత వ్యవహారం. ఈ విషయం ఇండియా, పాకిస్థాన్ లే తేల్చుకోవాలి అని సెలవిచ్చింది. ఈ వాదనతో భారత్ ఏకీభవించడం లేదు. ఇదొక కారణం కాగా.. బీఆర్ఐలో భాగంగా చైనా పెద్ద ఎత్తున ఇన్ ఫ్రా స్టక్చర్ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై భారత్ కు అనేక అనుమానాలు ఉన్నాయి. దీని కారణంగా చిన్న చిన్న దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి.
ఉదాహరణకు శ్రీలంక ను తీసుకుంటే ఆ దేశ అప్పులు చైనా అప్పుల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. చైనా ఇచ్చిన రుణాన్ని తీర్చలేక శ్రీలంక తమ ఆదాయ వనరులైన రేవులను చైనాకు అప్పజెప్పాల్సి వచ్చింది. ఈ రకంగా చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టి తద్వారా ఆ దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా భావిస్తోంది. బీఆర్ఐ ద్వారా చైనా ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోందని భారత్ వాదిస్తోంది. అందుకే భారత్ ఆది నుంచి దీనిని వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియా, బ్రిటీష్, యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను భారత్ నిర్మిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి