ఉమ్మడి ఏపీలో పెట్టుబడులు మొత్తం హైదరాబాద్ కే తరలివెళ్లాయి. దీంతో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన జరిగాక హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఏపీలో లేదు. ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. కొన్ని పరిశ్రమలు అక్కడ పెట్టేందుకు ముందుకు వచ్చినా కొన్ని కారణాల వల్ల పరిశ్రమలు ఏర్పాటు కాలేదు.
తాజాగా ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ను విశాఖలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మధురవాడలోని ఐటీ నెంబర్-2లో ఇన్ఫోసిస్ కొత్త డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. సుమారు రూ.40కోట్ల పెట్టుబడితో సుమారు 1000 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రస్తుతం ఐటీ కంపెనీల చూపు ద్వితీయ శ్రేణి నగరాలపై పడింది. ఇందులో భాగంగా వరంగల్, వైజాగ్ ఇతర నగరాలలో కంపెనీలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతోంది. ఐటీ ఉద్యోగులకు కావాల్సిన ఎంజాయ్మెంట్ తో పాటు బీచ్ లు ఆహ్లాదకర వాతావరణం వైజాగ్ కు సానుకూలాంశంగా మారాయి.
ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ విప్రో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీని సంబంధించిన విధివిధానాలపై చర్చించి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే వాళ్లు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇది ఒక కీలకాంశం. వైజాగ్ కు భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి