ఇందు గలడందు లేడని సందేహము  వలదు అన్న చందాన ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ సామాజిక వర్గం. దాదాపు అన్ని రంగాల్లోనూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటికే తమ స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇది ఈ రోజు వేసుకున్న ప్రణాళిక కాదు. వీరు వీళ్ళ అభివృద్ధిని, పురోగతిని వందల ఏళ్ళ క్రితం నాడే డిజైన్ చేసుకున్నారు. వందల ఏళ్ళ క్రితం నాడే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరూ కూర్చుని తమ వారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని దానికి తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకున్నారు.


దీనిలో భాగంగా కింద వాళ్లను కలుపుకొని వెళ్తూ ఉండేవారు. అలాగే తమ కన్నా పెద్దవారితో కలిసి సాగుతూ ఉండేవారు. లాభాన్ని- నష్టాన్ని, కష్టాన్ని-సుఖాన్ని అన్నింటినీ సమానంగా తీసుకునేవారు. తమ చుట్టూ ఉండే జనాలు కూడా వారికి ఏ కష్టం వచ్చినా పెద్ద మనుషులుగా వీళ్ళనే నియమించుకునేవారు. ఇదే ఎన్టీఆర్ రాజకీయంలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి కారణం అయ్యింది.


ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఇదంతా ఒక గతం అయిపోయింది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గంలో ఇప్పుడు ఉన్నవాళ్లు చాలామంది గోల్డెన్ స్పూన్‌  బేబీస్ కావడంతో వారికి వాళ్ళ పెద్దల కష్టం తెలియకుండా పోయింది. వాళ్ల పెద్దలు సంపాదించిన ఆస్తులు అనుభవిస్తూ వారిలో కొంతమందికి కుల పిచ్చి పెరిగిపోయింది అని అంటున్నారు కొంతమంది సామాజిక విశ్లేషకులు. అయితే ఇక్కడ వారి చేసేటువంటి తప్పు ఒకటి ఉంది.


వారు వారి సామాజిక వర్గాన్ని అభిమానించుకుంటే తప్పు లేదు. కానీ మిగిలిన సామాజిక వర్గాలని తమకన్నా తక్కువ వారన్నట్లుగా ప్రవర్తించడం చేస్తున్నారు, భావిస్తున్నారు అని అంటున్నారు వాళ్లు. వారిలోని ఒక 10 శాతం మంది ఆధిపత్యం వికటించి జగన్ గత ఎలక్షన్ లో 152 సీట్లు గెలుచుకోవడానికి కారణం అయింది. ఇప్పుడు ఈ 10 శాతం మంది వ్యక్తులు వల్లే ఆ సామాజిక వర్గం కొంతవరకు అలుసైపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: