నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేసింది. ఇష్టారాజ్యంగా ఖర్చు పెడితే కుదరదని.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరించింది. కేంద్ర నిధులతో చేపడుతున్న పథకాలకు కేంద్రం పేరు ఉండాలని సూచించింది. ఇక నుంచి నవరత్న లోగోలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ బొమ్మలు ఉండొద్దని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెబుతోంది. వీటిలో రాష్ట్రం నిధులు చాలా తక్కువ. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి వెఎస్ఆర్ పేరును జోడించి పీఎంఏవై-వెఎస్సార్ బీఎల్సీ పథకంగా మార్చింది. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వైఎస్ ఆర్ పేరు తొలగిస్తూ జీవో జారీ చేయాల్సి వచ్చింది. గృహ నిర్మాణమే కాదు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసీడీఎస్, వాసన పథకాలకు సంబంధించి కూడా కేంద్రం నిధులు భారీగా సమకూరుస్తుంది. మిషన్ వాత్సల్య , మిషన్ శక్తి పథకాలు కేంద్రం సహకారంతో నడుస్తున్నవే.
చిన్నారులకు, గర్భిణులకు అందించే పౌష్టికాహారం ప్యాకెట్ల పై సైతం జగన్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలను ముద్రిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి రూ.4వేల కోట్లు నిలిపినట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ముంగిట జగన్ సర్కారుకు కేంద్రం ఝులక్ ఇచ్చినట్లయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి