
2018 ఎన్నికలతో వైసీపీ సైలెంట్ అయిపోగా అప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన టీడీపీ చివరకు 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకపోవడంతో ఆంధ్ర నుంచి వస్తున్న పార్టీలు అని ప్రచారం చేయడానికి కేసీఆర్ కు ఏమీ లేకుండా పోయింది. ఈ అంశం కూడా సెంటిమెంట్ ను రగిల్చే విధంగా ఉండేది. కానీ టీడీపీ పూర్తిగా పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆ అంశంపై కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారు.
సరికదా మాకు సెటిలర్ల ఓట్లు ముఖ్యమనే విధంగా వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని అంటున్నారు. వైసీపీ అయితే ఎప్పుడో తెలంగాణ నుంచి జెండా ఎత్తేసింది. కానీ టీడీపీ ఈ సారి పోటీ లో నిలవకపోవడం మాత్రం చాలా మంది నిరాశ చెందుతున్నారు. అయితే ఇక్కడ జనసేన మాత్రం పోటీలో ఉంది.
బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ నిల్చొవడం ఇక్కడ సానుకూలంశం. కేవలం ఆంధ్ర పార్టీ అని భావించే జనసేన ఇక్కడ పోటీ చేయడం, ప్రధానంగా కూకట్ పల్లి లాంటి సెటిలర్లు ఎక్కువగా ఉండే చోట బరిలో నిలవడం ప్రధాన అంశంగా కనిపిస్తుంది. మరి కూకట్ పల్లిలో, ఖమ్మంలో జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ఎంతమందికి లాభం చేకూరే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ చరిశ్మా పని చేస్తుందా.. ఖమ్మంలో ఉండే సెటిలర్లు ఆదరిస్తారాా.. లేదా అనేది చూడాలి.