తాజాగా అమెరికాలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఉన్న ప్రఖ్యాత స్వామి నారయణ్ మందిర్ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ ఘటనపై అమెరికా విదేశంగా శాఖ స్పందించింది. నేరస్తులను పట్టుకునేందుకు నెవార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రయత్నాలు ప్రారంభించిదని పేర్కొంది. హిందూ ఆలయ గోడలపై దుండగులు భారత వ్యతిరేక అభ్యంతరకర చిత్రాలతో పాటు ఖలిస్థాన్ అంటూ కలర్ రాసి స్ర్పే చేశారు. నెవార్క్ లోని స్వామి నారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు ఉన్నాయంటూ తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.
పోలీసు అధికారులు వాటిని పరిశీలించారు. గ్రాఫిటీని రెచ్చగొట్టే చర్యగా ఆలయ పెద్దలు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. కావాలనే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. విద్వేష నేరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని తదితర ఆధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. గతంలోను భారత్ దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగాయి. జులైల్ శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అమెరికా, కెనడాల పౌరసత్వమున్న ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం ప్రమేయం వెనుక భారత్ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కాగా ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వెలుపల ఉగ్రవాదం, వేర్పాటు వాదాలను ఉపేక్షించరాదని డిమాండ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి