పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం అధికమైందని ఆ మధ్య కామెంట్స్ వినిపించాయి. ప్రధానంగా ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆది నుంచి తమ అధినేత జగన్ పై కేసులు ఉండటం ఆపై అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలను కోర్టులు తప్పు పట్టడంతో ఈ తరహా ఆరోపణలు చేసేవారు. న్యాయవ్యవస్థకు సైతం అవినీతి మరకలు అంటించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.


మూడు సంవత్సరాల క్రితం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తికి రూ.రెండు కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చేందుకు ప్రయత్నం జరిగిందని కానీ.. ఆ న్యాయమూర్తి దానిని తిరస్కరించడమే కాదు సుప్రీంకోర్టుకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఓ వార్తా పత్రిక కథనం రాసుకొచ్చింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర నిఘా సంస్థల సాయంతో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది.


జగన్ తరఫున ఓ టీటీడీ అధికారి, ఒక రాజ్యసభ సభ్యుడు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  కీలక న్యాయమూర్తుల ఇళ్లలో జరిగిన ఫంక్షన్లకు పిలవకపోయినా వీరు వెళ్లారని ఈ క్రమంలోనే వారికి ఖరీదైన బహుమతులు గిఫ్ట్ గా ఇవ్వబోయారని.. ఇలా ఇచ్చే వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీరు న్యాయమూర్తులకు ఇచ్చిన బహుమతుల విషయంలో త్వరలో పూర్తిస్థాయి స్పష్టత రానుందని టాక్ నడుస్తోంది.


జగన్ ఈ విధంగా న్యాయవ్యవస్థను మేనేజ్ చేసేందుకు యత్నిస్తున్నారని రాసుకొచ్చింది. అయితే ఆ జడ్జి లొంగలేదని స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ఏపీ సీఎం ఇప్పటి వరకు స్పందించలేదు. తన పత్రిక సాక్షిలో కూడా ఎలాంటి ఖండన వార్త రాలేదు.  అంటే జగన్ తప్పును ఒప్పుకున్నట్లేనా.. అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన నిజంగా ఈ తప్పు చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: