వైఎస్ జగన్.. ఆయన ఎప్పుడూ రాజకీయమే ఆలోచిస్తూ ఉంటారు.  ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ కోసమే అని పలు సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు.  అలాంటిది ఇప్పుడు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో వైసీపీ నాయకులకే వెన్నులో వణుకు పడుతోంది. చాలా చోట్ల సిట్టింగ్ లను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొంతమందిని స్థాన చలనం  చేశారు.


పార్టీలో సీనియర్లను సైతం పక్కన పెట్టి  ఓసీ జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జే అని ఇప్పటికే ప్రకటించేశారు. అందుకు అనుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇన్ ఛార్జిని ప్రకటించిన వారం పది రోజులకే మళ్లీ మార్చడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అవుతుంది. ఇలా ఇప్పటికే పది మంది ఇన్ ఛార్జిలను మార్చారు.  దీంతో అటు అభ్యర్థులు, ఇటు పార్టీ క్యాడర్ గందరగోళానికి గురువుతోంది.


నియోజకవర్గ ఇన్ ఛార్జిని ప్రకటించాక వారు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చుపెడుతున్నారు. క్యాడర్ ను మచ్చిక చేసుకొనే ప్రయత్నాల్లో ఉంటున్నారు. ఇంతలోనే  తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి సడన్ గా పిలుపు వస్తోంది. అన్నీ సెట్ చేసుకున్నాక… మీ నియోజకవర్గం మార్చుతున్నాం.. లేకపోతే ఈ సారి మీకు అవకాశం ఇవ్వడం లేదని చెబుతుండటంతో వారంతా అవాక్కవుతున్నారు. ఇలా ఇష్టాను సారంగా ఇన్ఛార్జిలను మార్చుతుండటంతో క్యాడర్ కూడా అసహనం వ్యక్తం చేస్తోంది.


ప్రత్యర్థి పార్టీల పొత్తుల వల్ల నష్టపోయేదానికంటే స్వయంకృతాపరాథమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు బీసీ అస్త్రం పనిచేస్తుందా అనే అనుమానాలు పార్టీ నాయకుల్లో ఉంది. దీంతో పాటు వరుసగా కొంచెం పలుకుబడి ఉన్న  నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి, రాంచంద్రారెడ్డి, మాగుంట, వసంత కృష్ణప్రసాద్ వంటి నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇది వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. దీంతో తిరిగి అధికారం చేపడతామా లేదా అనే చర్చలు పార్టీలో జోరుగా నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: