ఎన్నికలు ముగిశాయంటే చాలు  ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. గెలుస్తామా లేదా అని పార్టీ నేతలు కలవరపడుతుంటారు. ఇంక బెట్టింగ్ రాయుళ్లు తీరు కూడా అంతే. రాజకీయ నాయకులు  కన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. వీరు ఒక అంచనాకు వచ్చి ఆయా పార్టీలపై బెట్టింగ్ లు పెడుతూ ఉంటారు. దాదాపు ట్రెండ్స్ ను ఫాలో అవుతూ వీరి పందెలు కాస్తుంటారు.


అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ముఖ్యమే. వీరు కూడా ఆయా పార్టీల గెలుపును బట్టి వీరు మూమెంట్ తీసుకుంటూ ఉంటారు.  గతంలో చంద్రబాబు హయాంలో రియల్టర్లు అంతా విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న భూములను మొత్తాన్ని కొనేశారు. రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వస్తున్న దశలో ప్రభుత్వం మారిపోయింది. వాస్తవంగా వీరు చంద్రబాబు మరోసారి రావాలని బలంగా కోరుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం ఒక రూపానికి వస్తే తమ పెట్టుబడులకు నష్టం రాదనే ఉద్దేశంతో.


కానీ అనూహ్యంగా వైసీపీ ఘన విజయం సాధించింది. అయినా ప్రభుత్వం అమరావతినే రాజధానిని కొనసాగిస్తుందని వీరు భావించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో వీరంతా కంగుతిన్నారు. ఏం చేయలేక మిన్నకుండిపోయారు. అప్పట్లో ఆరు నెలల్లో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న రియల్టర్లు.. వెంటనే వెంచర్లు వేయడం ప్రారంభించారు. మళ్లీ ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేర్ రంగం గాడిన పడింది.


ఈ క్రమంలో సుప్రీం కోర్టులో రాజధాని నిర్ణయానికి మరోసారి బ్రేక్ పడటంతో మరోసారి రియల్ ఎస్టేట్ కుదేలైంది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికల సమయంలో ఏమైనా ఇక్కడ రేట్లు పెరిగితే అమ్మేసుకుందాం అని చూస్తున్నారు. కానీ ఆ విధమైన ఊపు రావడం లేదు. కానీ కూటమి వస్తుందనే సంకేతాల మధ్య ఇక్కడ కొనుగోళ్లు ఏమైనా ఊపందుకుంటాయా అనేది చూడాలి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావాలని రియల్టర్లు బలంగా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: