ఏపీలో సార్వత్రిక పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రజానికం. వీటి కోసం జూన్ 4 వరకూ వెయిట్ చేయడమే అటు నాయకులకు.. ఇటు కార్యకర్తలకు పెద్ద సహన పరీక్షలా ఉంది. అయితే ఈ గ్యాప్ లో వాళ్ల ఆత్మస్థైర్యం కోసం ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇందులో కొన్ని విశ్వాసంతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని ఆత్మవంచనకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి.


 ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన ఓట్లపై ఆసక్తికర చర్చ సాగుతుంది. అదే తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నియోజకవర్గాల వారి పోలింగ్ లెక్కలు. ఇందులో ప్రధానంగా స్త్రీ ,పురుషుల పోలింగ్ వివరాలను స్పష్టంగా వెల్లడించారు. దీంతో ఈ లెక్కలు సరికొత్త చర్చకు దారి తీశాయి. అసలు ఈ లెక్కలు ఏంటి? టెన్షన్ ఎవరికీ అనేది ఓ సారి పరిశీలిస్తే..


సోమవారం ఏపీలో ముగిసిన పోలింగ్ కి సంబంధించి నియోజకవర్గాల వారీగా స్త్రీ, పురుషులు ఎంత మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అనే వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది.  ఇందులో 16,430,359 మంది పురుషులు, అలాగే 16,908,684 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే మగవాళ్ల కంటే ఆడవాళ్లు  దాదాపు ఐదు లక్షల మంది ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కలపై ఆయా పార్టీల నాయకులు ఎవరికీ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మహిళలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ బలంగా చెబుతోంది. ఎందుకంటే జగన్ గరిష్ఠంగా సంక్షేమ పథకాలను మహిళలకే అందజేస్తున్నారు. వారి ఖాతాలకే నగదు బదిలీ చేస్తున్నారు. దీంతో 80శాతం మహిళలు తమకే అనుకూలంగా ఉన్నారని వైసీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేతలు కూడా అందరికీ అమ్మ ఒడితో పాటు, ఫ్రీ బస్, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లకు ఆకర్షితులయ్యారని వీరంతా తమకే ఓటు వేశారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక ఎవరు ఏమి చెప్పినా.. జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఎవరి లెక్కలు నిజం అవుతాయో అప్పుడే తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: