ఏపీలో హోరాహొరీ ఫైట్ నడిచింది. ఎవరికీ వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. పోలింగ్ శాతం పెరగడంతో తమకు అనుకూలమని టీడీపీ కూటమి బలంగా విశ్వసిస్తోంది. అయితే అదంతా పాజిటివ్ ఓటింగ్ అని కూడా వైసీపీ భావిస్తోంది. సీఎంగా జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స  సత్యనారాయణ ప్రకటించడం   ఈ హీట్ ని మరింత తారాస్థాయికి తీసుకెళ్లింది.


అదే సమయంలో చంద్రబాబు కూడా తప్పకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆపధర్మ సీఎంగా జగన్ తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. కానీ ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. కుటుంబంతో సహా విహార యాత్రకు యూరప్ వెళ్లారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు తెరపైకి వచ్చారు. వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. గవర్నర్ తో పాటు ఎలక్షన్ కమిషన్ కు లేఖలు రాస్తున్నారు.


రాష్ట్రంలో ఉన్నతాజా పరిస్థితిని తెలయజేస్తున్నారు. దీంతో చంద్రబాబు సీఎం పదవిలోకి పరకాయ ప్రవేశం చేశారని పలువురు పేర్కొంటున్నారు. శాసన సభలో తనకు జరిగిన అవమానంపై కన్నీటి పర్వంతం అయిన చంద్రబాబు మళ్లీ తాను సీఎంగానే హౌస్ లో అడుగుపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది జరిగి తీరుతుందని టీడీపీ శ్రేణులు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే బాస్ ఎంటర్ అయ్యారని టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా మూడు కీలక అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు వైసీపీ పావులు కదిపిందని చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశారు. వాటిని  విడుదల చేయాలని కోరగా వెంటనే ఆ నిధులు విడుదల అయ్యాయి.ఇంకా అల్లర్లకు సంబంధించి.. ప్రభుత్వ జీవోలు దాచుకునే ఈ ఆఫీస్ అప్ గ్రేడషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిని తొలగింపజేసేందుకే అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పనులను తక్షణం ఆపేయించాలని కోరారు. వీటికి ఈసీ ఆమోద ముద్ర వేయడంతో చంద్రబాబు సీఎం పదవిలో పరకాయ ప్రవేశం చేశారని టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: