కోట్ల మంది ఓటర్లు. పైగా వివిధ వర్గాలు, వర్ణాలు. ఈ లెక్కలు ఎలా కుదురుతాయి అంటే చేయాలే కానీ రాజకీయ గణితంలో డిస్టిక్షన్ పాస్ కావొచ్చు అన్నది వైసీపీ థియరీ. ఆ పార్టీ 2019 లో ప్రత్యేక వ్యూహాలు అనుసరించే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు వైసీపీ విపక్షంలో ఉంది. దాని కంటే ముందు 2014లో వైసీపీ కేవలం ప్రచారాన్ని మాత్రమే నమ్ముకొని పనిచేసింది. దీంతో 67 సీట్లు దక్కాయి. ఆనాడు ఎలక్షనీరింగ్ లో వైసీపీ తడబడింది. టీడీపీ దీనిని ఆసరాగా చేసుకొని విజయాన్ని కైవసం చేసుకుంది. లోపాన్ని సరిచేసుకొని 2019లో టీడీపీకి భారీ షాకే ఇచ్చింది.


ఇప్పుడు మరోసారి అవే లెక్కలతో 2024 ఎన్నికలకు సిద్ధం అయింది. రాష్ట్రంలో ఈ సారి 81.86 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇది పట్టణాల్లో 62.62శాతంగా ఉంటే.. గ్రామాల్లో అయితే ఏకంగా 82.32శాతంగా ఉంది. మరోవైపు వైసీపీ గ్రామాల్లో బలంగా ఉంది.  రూరల్ ప్రాంతాలనే వైసీపీ బలంగా టార్గెట్ చేసింది. అక్కడే పార్టీకి ఫేవర్ గా ఉండటంతో గెలుపు దిశగా పరుగులు తీస్తామని బలంగా నమ్ముతోంది. ఏపీలో మొత్తం 175 సీట్లు ఉంటే అందులో రూరల్ పరిధిలో ఉన్నవి 117 స్థానాలు. అర్బన్ లో 58 ఉన్నాయని ప్రాథమిక అంచనా. రూరల్ లో భారీగా పోలింగ్ సాగడం, మహిళలు, వృద్ధులు ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొనడం వంటివి మా పార్టీకే కలిసి వస్తాయి అని వైసీపీ తెగ సంబురపడుతోంది.


ఏపీలో మొత్తం 3.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2.94 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో వర్గాల వారీగా మళ్లీ లెక్కలు తీశారు. మొత్తం 8.5శాతం రెడ్లు ఉంటే అందులో వైసీపీకి 6.0శాతం,  మిగిలిన అగ్రవర్ణాల్లో 15శాతం ఉంటే అందులో మూడు శాతం మాత్రమే వైసీపీకి పోలయ్యాయి అని అంచనా వేస్తున్నారు. ఇందులో ఓసీ కాపులు పది శాతం ఉంటే వైసీపీకి రెండు శాతం, బీసీలు 38 శాతం ఉంటే… వైసీపీకి 20శాతం, ఎస్సీ, ఎస్టీ 20శాతం ఉంటే  వైసీపీకి 16శాతం, ముస్లింలు 9శాతం ఉంటే వైసీపీకి 7శాతం  టోటల్ గా 54 శాతం వరకు వైసీపీకే ఓట్లు పోలయ్యాయి అని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: