- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఎక్కడకక్కడ కూటమి ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నా దాదాపు 90 శాతం మంది పార్టీ కార్యకర్తలలో ఏమాత్రం ఉత్సాహం లేదు. ఎక్కడా హుషారు లేదు.. తెలుగుదేశం పార్టీని గత ఎన్నికలలో ఎలాగైనా గెలిపించేందుకు చాలామంది సర్వశక్తులు వడ్డారు. ఇప్పుడు వారికి కూడా చిన్న చిన్న పనులు కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలకు ... సొంత పార్టీ కార్యకర్తలకు చిన్న చిన్న పనులు చేసి పెట్టాలన్నా కూడా డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి ఉందంటున్నారు. చివరకు చిన్న చిన్న పదవులు ఇచ్చేందుకు కూడా భారీగా డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి ఉందట.


చాలా నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అసలు ముక్కు మొహం తెలియని నేతలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కూటమి ప్రభంజనంలో వారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన వారిని ఇప్పుడు ఆ గెలిచిన ఎమ్మెల్యేలు పక్కన పెట్టేస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ... కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కావడం లేదు. చిన్న పదవులు రావడం లేదు. చివరికి కొందరు ఎమ్మెల్యేలు విపక్ష పార్టీలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకుని వారి దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేయిస్తూ పదవులు కట్టబెడుతున్నార‌న్న‌ విమర్శలు కూడా ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: