
ఈ విషయాలు ప్రస్తావిస్తూ పార్టీ ఎంపీలతో సమావేశమైన సీఎం, జగన్ మోహన్ రెడ్డి అనుచరులు మూర్ఖత్వం, క్రూరత్వం లక్షణాలను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇటీవలి నకిలీ మద్యం కుంభకోణంలో కూడా అదే ఆట ఆడారని, దర్యాప్తు దశలో అనేక రహస్యాలు బయటపడుతున్నాయని చెప్పారు. ఈ రకమైన చర్యలు రాష్ట్ర స్థిరత్వానికి ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు.వైసీపీ నాయకత్వం క్రిమినల్ మాస్టర్ మైండ్‌లా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వివేక హత్య రీతిలోనే నకిలీ మద్యం వ్యవహారాన్ని జరిపారని, టీడీపీపై మట్టి పెట్టేందుకు ఈ ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడుతున్న వాస్తవాలు ఈ పార్టీ నేర కార్యకలాపాలను బహిర్గతం చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ ఎంపీలకు ఇలాంటి దుర్మార్గాలకు గట్టి అడ్డంకి వేయాలని దిశానిర్దేశం చేశారు. జగన్ పాలిత దశలో జరిగిన అవినీతి, అన్యాయాలు ఇప్పుడు పూర్తిగా బయటపడుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రజలకు న్యాయం కల్పించే అవకాశమని ఆయన అన్నారు.
ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.దీని తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి విషయాలు చర్చించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సుమారు 45 నిమిషాలు నిర్వహించబడింది. సీఎం వెంట యూనియన్ మంత్రులు రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. కర్నూలులో 16న జరగనున్న 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు