ఏపీ అంటేనే రాజ‌కీయ చ‌ర్చ‌ల‌కు పెట్టింది పేరు. ఏ టీ కొట్టు ద‌గ్గ‌ర చూసినా.. రాజకీయాలు వినిపిస్తాయి. ఎక్క‌డ న‌లుగురు చేరినా.. రాజకీయ వ్యాఖ్య‌లే హ‌ల్చ‌ల్ చేస్తాయి. ఇలానే.. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్.. పాద‌యాత్ర‌పై ప్ర‌క‌ట‌న చేసిన ద‌రిమిలా.. ఆయ‌న పాద‌యాత్ర‌పై ఆస‌క్తిక‌ర చర్చ కొన‌సాగుతోంది. వ‌చ్చే ఏడాదిన్న‌ర త‌ర్వాత‌.. అంటే.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి మూడేళ్లు నిండిన త‌ర్వాత‌.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్యకు వస్తాన‌ని ప్ర‌క‌టించారు.


దీంతో ఆయ‌న పాదయాత్ర‌కు సంబంధించి జ‌నంలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. కానీ.. మ‌రోవైపు.. అక్ర‌మ మ‌ద్యం కేసు స‌హా.. రీ స‌ర్వే కు సంబంధించిన భూముల ఆక్ర‌మ‌ణ‌లు.. వంటి కేసులు ఎదురు చూస్తున్నా యి. దీంతో జ‌గ‌న్ అరెస్ట‌వుతారని.. ఆయ‌న పాద‌యాత్ర‌కంటే కూడా.. జైలు యాత్రే ముందు సాగుతుంద‌ని టీడీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఏది ముందు అనేది చ‌ర్చ సాగుతోంది.


వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలోనే జ‌గ‌న్‌పై ఏమైనా కేసులు ఉంటే అరెస్టు చేయాలి. లేక‌పోతే.. ఏడాది త‌ర్వాత వాటి దుమ్ముదులిపినా.. ప్ర‌యోజ‌నం లేద‌న్నది టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు అరెస్టులు చేస్తే.. అది వైసీపీకి అయాచిత వ‌రంగా మారుతుంద‌ని.. అప్పుడు జ‌గ‌న్ స‌హా వైసీపీపై సానుభూతి పెరుగుతుంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. కానీ, ఇప్ప‌టికిప్పుడు కేసులు కొలిక్కి రాలేదు. ఇంకా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా చెబుతున్న అక్ర‌మ మ‌ద్యం కేసు విచార‌ణ కొన‌సాగుతోంది.


ఇక‌, ఈ కేసులోనూ ఇంకా బ‌ల‌మైన ఆధారాల కోసం సిట్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది త్వ‌ర‌గా తేలుతుంద‌న్న ఆశ కూడా ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు. దీంతో స‌ర్కారు ఎలాంటి అడుగులు వేస్తుంద న్న‌ది చూడాలి. గ‌తంలో వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకుం ది. ఇప్పుడు అలా జ‌ర‌గ‌కుండా చూడాలంటే.. ఈ ఏడాది కాలంలోనే జ‌గ‌న్ పై చ‌ర్య‌లు తీసుకోవాలి. ఇదే జ‌రిగితే.. పాద‌యాత్ర కంటే ముందు జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: