తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి 'సమగ్ర శిక్ష అభియాన్‌'లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికి  తెలిసిందే కదా. దీనిద్వారా వివిధ విభాగాల్లోని మొత్తం 704 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటిలో మేనేజ్‌మెంట్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం (MIS) ఎంఆర్పీ విభాగంలో కోఆర్డినేటర్ పోస్టులు; డీఈవో, డీపీవో కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, సిస్టం అనలిస్ట్ పోస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ అని వివిధ పోస్టులు వివిధ అర్హతలతో ఉండడం జరిగింది.

 

గతంలో  ప్రకటించిన  షెడ్యూలు ప్రకారం నవంబరు 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు అవ్వాల్సి ఉండగా.. నవంబరు 20కి వాయిదా వేయడం జరిగింది. అభ్యర్థులు నవంబరు 20 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని అధికారులు తెలియచేయడం జరిగింది. దరఖాస్తు చివరితేదిని ఇంకా వెల్లడించలేదు. కొత్త జిల్లాల వారీగానే నియామకాలు 
తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.


  
ఇక  అసలు విషయమైనా పోస్టుల వివ‌రాలు చూద్దామా మరి... మొత్తం ఖాళీలు వచ్చేసి 704 . ఇందులో వివిధ విభాగాలు వివిధ పోస్ట్ వివరాలు ఇలా  ..ఎంఐఎస్ కోఆర్డినేట‌ర్‌ - 144 . సంబంధిత అర్హత  బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), పీజీడీసీఏ (లేదా) బీఎస్సీ(ఎంపీసీ), పీజీడీసీఏ (లేదా) బీసీఏ, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. సిస్టమ్ అన‌లిస్ట్‌ - 12 , సంబంధిత  అర్హత బీకామ్/ఎంకామ్ (అకౌంటింగ్ ప్యాకేజీ) . అసిస్టెంట్ ప్రోగ్రామ‌ర్‌ - 27 , సంబంధిత  అర్హత: ఎంసీఏ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉండాలి. ఒరాకిల్ నాలెడ్జ్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ - 138 , సంబంధిత   అర్హత ఏదైనా డిగ్రీతోపాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్   ఎడ్యుకేష‌న్ రిసోర్స్ ప‌ర్సన్‌ - 383  అర్హత‌: ఇంటర్‌తో పాటు డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి.

 

ఇక  వ‌య‌సు వయోపరిమితి మాత్రం 01.07.2019 నాటికి 34 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఇక  ద‌ర‌ఖాస్తు విధానం మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది . విధానం  క‌ంప్యూట‌ర్ ఆధారిత నియామక పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుంటారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్  పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోవాలని కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: