దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీలు అందరు ఈ మహమ్మారి పేరు చెబుతూనే భయపడిపోతున్నారు. ఇక ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంత వరకు ప్రజలంతా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని అధికారులు వెల్లడించారు.

ఇక అన్ లాక్ 4 ద్వారా లాక్ డౌన్ లో సడలింపులు చేశారు. అయితే ఇప్పటికే మహమ్మరి కారణంగా విద్యాసంస్థలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అయితే ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం 2020-21 సంవ‌త్సరానికిగాను బీఎస్సీ (హాన‌ర్స్‌), బీటెక్ (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి నోటిఫికేషన్ వేసింది. ఇక ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్‌ 4, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.pjtsau.edu.in/ చూడొచ్చుని అధికారులు వెల్లడిచారు.

కోర్సులు: బీఎస్సీ (హాన‌ర్స్‌), బీటెక్ (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) సీట్లు: బీఎస్సీ (హాన‌ర్స్‌)-65, బీటెక్ (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌)- 7. అర్హ‌త‌: డిప్లొమా(అగ్రిక‌ల్చ‌ర్‌, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్‌), డిప్లొమా (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌ ఉండాలి. 2019-20 విద్యాసంవ‌త్స‌రం వారు అర్హులే. ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప‌రీక్ష తేది: అక్టోబర్‌ 13, 2020. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.600. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 04, 2020. వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/

మరింత సమాచారం తెలుసుకోండి: