FCI (food corporation of india ) నిరుద్యోగులకు శుభవార్త తీసుకొచ్చింది. FCI లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 89 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 మార్చి 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు . అప్లై చేయడానికి 2021 మార్చి 31వ  చివరి తేదీ. పూర్తి వివరాల కోసం  కింద ఇచ్చిన లింక్ ను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు కేవలం ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

FCI recruitment 2021: ఖాళీలు
మొత్తం ఖాళీలు -89
జనరల్-43,
ఎస్సీ-14,
ఈ డబ్ల్యూ ఎస్-9,
ఓబిసి-7,
ఎస్టీ -6.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్( జనరల్ అడ్మినిస్ట్రేషన్ )-30
అసిస్టెంట్ జనరల్ మేనేజర్( టెక్నికల్)-27
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ )-22
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా )-8
మెడికల్ ఆఫీసర్-2

దరఖాస్తు ప్రారంభం -2021 మార్చి 1  ఉదయం 10 గంటల నుండీ
దరఖాస్తు చివరితేది -2021 మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు.
అడ్మిట్ కార్డ్ విడుదల - పరీక్షకు 10 రోజుల ముందు
రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ -2021 మే లేదా జూన్.

విద్యార్హతలు- వేర్వేరు  పోస్టులకు వేర్వేరు  విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు-రూ. 1000.
ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు,మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ.ఆన్లైన్ టెస్టులో అన్ రిజర్వుడ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ,  దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. ఖాళీ ల కన్నా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులు ఎక్కువగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

వేతనం-రూ. 50,000 నుంచి 1,80,000 వరకు

అయితే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ముందు, నోటిఫికేషన్ లో పొందుపరిచిన అన్ని విషయాలను పూర్తిగా గమనించి,ఆ తరువాత మాత్రమే అప్లై చేసుకోవాలని ఎఫ్ సీ ఐ కోరుతోంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ త్వరగా అప్లై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: