రాష్ట్రంలో ఉపాద్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కాళీలు ఉన్నట్టు విద్యాశాఖ ఇటీవలే ప్రభుత్వానికి తెలిపింది. అయితే వాటిలో 14,061 ఎస్జీటీ పోస్టులు ఉన్నట్టు వెల్లడించింది. అంతే కాకుండా జిల్లావారిగా ఉన్న ఖాళీల వివరాలను కూడా ప్రభుత్వానికి నివేధిక పంపినట్టు సమాచారం. జిల్లాల వారిగా చూసుకుంటే ఆరు జిల్లాల్లో వెయ్యికి పైగా ఖాళాలు ఉన్నట్టు విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఎక్కువ పోస్టులు చిత్తూరులో 2,552 పోస్టులు ఉన్నట్టు వెల్లడించింది. ఇక తక్కువ పోస్టులు అనంతపురం జిల్లాలో 467 పోస్టులున్నాయి. ఇక 16 టీచర్ పోస్టులకు సంభందించిన ఫైల్ సాధారణ పరిపాలన, ఆర్తిక శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ రెండు శాఖల వద్ద అనుమతి వచ్చిన వెంటనే డిఎస్‌సీ నోటిఫికేషన్ ను ఇస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తామని చెప్పడంతో నిరుద్యోగుల్లొ డీఎస్సీ పై ఆశలు చిగురించాయి. ఇటీవల చేసిన టీచర్ల సర్దుబాటుతో ఎక్కువ మొత్తంల ఏకోపాద్యాయ పాఠశాలలు ఏర్పాడ్డాయి. అంతే కాకుండా ఈ ఏడాది దాదాపు మరో నాలుగు లక్షలమంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. విద్యార్థుల సంఖ్య పెరిగి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గితే భోదన కుంటుపడే అవకాశం ఉంది. మరోవైపు రానున్న రెండేళ్లలో సుమారు 7500 ఉపాధ్యాయులు ఉద్యోగవిరమణ చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఇక జిల్లాల వారిగా పోస్టుల వివరాలు చూసుకుంటే...శ్రీకాకులం జిల్లాలో 862, విజయనగరం 832, విశాఖపట్నం 1165, తూర్పుగోదావరి జిల్లాలో 1490, పశ్చిమగోదావరి 1390,
కృష్ణా జిల్లా 1094, గుంటూరు 911, నెల్లూరు 1256, ప్రకాశం 796, కడప 807, చిత్తూరు 2552, అనంతరపురం 467, కర్నూలులో 506 పోస్టులు ఉన్నాయి.