బంగారం ధరలు ఎంత దారుణంగా పెరుగుతున్నాయి అంటే.. గతంలో ఎన్నడూ ఇంత దారుణంగా పెరిగింది లేదు.. కేవలం అంటే కేవలం ఒక సంవత్సరంలో బంగారం ధరలు ఏకంగా 16 వేలు పెరిగింది. నిజంగా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని లాభాలో అని అనిపిస్తుంది అంటే నమ్మండి.. 

 

ఇంకా అలాంటి బంగారం ధర ఇప్పుడు మరి దారుణంగా పెరిగిపోతుంది.. కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు మరి దారుణంగా పెరిగిపోయాయి.. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు అన్ని పూర్తిగా కుప్పకూలిపోయాయి.. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే పెట్టారు.. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి ఏమో.. ఇంకా ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిల పెరుగుదలతో 47,250 రూపాయలకు చేరింది. 

 

అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 350 రూపాయిల పెరుగుదలతో 44,490 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 42,010 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గినప్పటికీ.. పెరిగినప్పటికీ ప్రస్తుతం కొనే స్థితి లేకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: