అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు పైకి కదిలాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఈ బంగారం ధరలు చూస్తే.. మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.48,070 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. దీంతో ధర రూ.44,060 వద్దనే ఉంది.. ఇక వెండి విషయానికొస్తే..బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.300 పడిపోయింది. దీంతో రేటు రూ.73,100కు క్షీణించింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి పూర్తిగా తగ్గిపోవడంతో వెండి రేట్లు పూర్తిగా తగ్గిపోయింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు చూస్తే..బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1839 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.01 శాతం తగ్గుదలతో 27.57 డాలర్లకు క్షీణించింది.
ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం స్టోర్ లు మొదలగు అంశాలు రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి.ఇక రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి