మహిళలకు చేదు వార్త.. నిన్నటి వరకు కాస్త ఉపశమనం కలిగిస్తున్న ధరలు నేడు మార్కెట్ లో బాగా పెరిగాయి.బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. గత మూడు రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైపైకి కదిలింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం, వెండి కొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు... గత రెండు రోజులుగా విదేశీ మార్కెట్ లో కిందకు దిగి వస్తున్నాయి. ఈరోజు కూడా ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. 



హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పైకి చేరింది. దీంతో రేటు రూ.47,190కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.260 పెరుగుదలతో రూ.43,260కు చేరింది... నిన్న రేటుకు ఇవాళ్టి రేటుకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ల లో వెండి కూడా అదే దారిలో నడిచింది. బంగారం ధరల పై ఆధారపడి ఉన్నాయి .నేటి మార్కెట్ లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.



వెండి ధర కేజీకి రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.73,800కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు... అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.57 శాతం పెరుగుదలతో 1787 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.89 శాతం పెరుగుదలతో 27.75 డాలర్లకు ఎగసింది.. వాణిజ్య పరంగా బంగారం కొనుగోళ్లు పై వేటు పడటంతో రోజు బంగారం ధరలు తగ్గడానికి, పెరగడానికి కారణం అవుతున్నాయి. రేపటి రోజున మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: