హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పైపైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి కదిలింది. దీంతో రేటు రూ.45,980 కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.350 పెరుగుదల తో రూ.42,150కు ఎగసింది. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యం లో వెండి ధరలు కూడా పైకి కదిలాయి.
గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన కిలో వెండి ధర మాత్రం ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. ఏకంగా కేజీకి ఏకంగా రూ. 1800 పెరిగింది. దీంతో రేటు రూ.73,200కు ఎగసింది. వస్తువుల తయారీ.. విక్రయాలు పూర్తిగా తగ్గి పోవడంతో వెండి రేట్లు కిందకు దిగాయి..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఈరోజు ఉరుకులు పెట్టింది. బంగారం ధర ఔన్స్ కు 0.04 శాతం పెరుగుదల తో 1723 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 26.18 డాలర్లకు క్షీణించింది.. మొత్తానికి మళ్లీ బంగారం రేట్లు పెరిగేలా ఉన్నాయని అంటున్నారు .. ఏదీ ఏమైనా ఉగాది ముందు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.. మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి