కోట్ల కొద్దీ డబ్బులున్నా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు కానీ.. నయం కాని వ్యాధులు కానీ వస్తే ఆ డబ్బులు ఎందుకు పనిచేయవు.. కానీ వ్యాధి నిర్మూలన ముందు నుంచే ఉంటే సాధ్యమైనంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచు. అయితే ఆరోగ్యకరమైన జీవితానికి ఏం చేయాలి.. ఏం తినాలి అన్న సందేహాలు రావడం సహజం. ఆయన అది చెప్పారని.. ఈయన ఇది చెప్పారని కాదు. మన బాడీకి ఏది ఎంత సరిపోతుంది అన్నది ముందు తెలుసుకోవాలి. దాని వల్లే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.

కడుపు నిండా తిన్నా తప్పే.. అలా అని అసలు తినకుండా ఉన్నా తప్పే. ఏ ఆహారమైనా మితగా తింటే ఎలాంటి అనారోగ్య సంస్యలు వాటి వల్ల రావు.. వచ్చినా వాటంతట అవే నయం అయ్యేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇష్టమైన ఫుడ్ ఉంటే ఆరోజు కడుపునిండా లాగించేస్తారు. అలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థలో మార్పులు వస్తాయి. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో ఈ తేడాలు బాగా కనిపిస్తాయి.

అయితే అసలేమి తినకుండా ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. మిగతంగా తినడమే మంచిదని అందరు చెబుతున్నారు. ఇష్టమైన ఆహారం అయినా.. అయిష్టంగా అనిపించే ఆహారం అయినా కొద్దిపాటిగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆపద ఉండదని అంటున్నారు. అంతేకాదు మిగతంగా తీసుకోవడం వల్ల డైజేషన్ కూడా చాలా ఈజీగా అవుతుందని. సాధ్యమైనంతవరకు ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సో ఏం తినా ఎలా తిన్నా మిగతంగా తింటే ఏ సమస్యలు ఉండవన్నమాట.  జంక్ ఫుడ్ మాత్రం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు డీప్ ఫ్రైస్ కూడా అనారోగ్యానికి కారణం అవుతాయని తెలుస్తుంది. సో ఫుడ్ విషయంలో కొన్ని మార్పులు ఆరోగ్యకరమైన జీవితాన్నికి కారణం అవుతాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: