గౌట్ సమస్యలు అంటే మన శరీరంలోని చుట్టూ కీళ్ల చుట్టూ యూరిక్ యాసిడ్ స్పటికాలుగా మారి,నొప్పులు మరియు జోములు వచ్చేలా చేస్తాయి.దీనినే డౌట్ సమస్యలు అంటారు.సాధారణంగా మన బాడీలో,మనం తిన్న ఆహారంలోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్ని తయారు చేస్తుంది.ఆ యూరిక్ యాసిడ్ మనం యూరిన్ వెళ్ళినప్పుడు బయటకి వెళ్ళిపోతుంది.కానీ కొంతమంది నీళ్ళు సరిగా తీసుకోకపోవడం వల్ల మరియు వారి విసర్జన వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వల్ల,యూరిక్ ఆసిడ్ మన శరీరంలోని పేరుకుపోయి,స్పటికాలుగా మారుతుంది.

ఇలా యూరిక్ యాసిడ్ని స్పటికాలుగా మారనివ్వకుండా ఎప్పటికప్పుడు విసర్జించేలా చేసే కొన్ని ఆహారాలు మనం తీసుకోవడం వల్ల,గౌట్ సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

టమాటాలు..

మన సంప్రదాయ వంటల్లో టమాటా లేని కూరలు అంటూ ఏమీ ఉండవు.టమాటాలను తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని విటమిన్ సి,యూరిక్ యాసిడ్ మన శరీరం నుంచి ఎప్పటికప్పుడు విసర్జించేందుకు ఉపయోగపడుతుంది.కావున జంక్ ఫుడ్ తీసుకోకుండా సంప్రదాయ వంటలు తీసుకోవడం చాలా మంచిది.

కీరదోస..

వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయల్లో కీరదోస ఒకటి. దీనిని వేసవి సీజన్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము.ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల,ఇది యూరిక్‌ యాసిడ్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.కీరాలో నీటి పరిమాణం అధికంగా ఉంటుంది కనుక, దీనిని గౌట్‌ పేషెంట్స్‌కు మంచి ఆహారంగా చెప్పవచ్చు.

పుట్టగొడుగులు..

తరుచూ పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల, ఇందులో బీటా-గ్లూకాన్స్ అనే ఒక రకమైన కార్బోహైడ్రేట్ పుష్కళంగా లభిస్తుంది.అ కారబోహైడ్రెట్ శరీరంలో మంట,వాపును నివారిస్తుంది.బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్‌ కారణంగా కూడా యూరిక్‌ యాసిడ్‌ లెవెల్స్ పెరుగుతాయి.కావున గౌట్‌ తో బాధపడేవారు పుట్టగొడుగులను తీసుకోవడం చాలా మంచిది.


గుమ్మడికాయ..

ఇందులో విటమిన్‌ సి,బీటా కెరోటిన్‌,లుటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.అ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపు,ప్యూరిన్ ఒత్తిడిని తగ్గిస్తాయి.ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.కావున గౌట్ సమస్యలతో బాధపడేవారు  గుమ్మడికాయను తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: