సాధారణంగా  టీ అంటే చాలా మంది ఇష్టం. చాల మంది  టీ  ఎక్కువగా తాగుతుంటారు. ఇక ఆఫీసుల్లో పనులతో ఇబ్బందిగా ఉన్న.. ఇంటి పనులతో అలసిపోయిన  ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది మాత్రం టీనే. ఇలా  టీని తాగడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి...టీ సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకూ అందుబాటులో ఉండేది అదే టి గొప్పదనం .. టీలో  పాలు కలిపి తయారు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. దీంతో ఎముకలు కూడా బాగా దృఢంగా తయారుఅవుతాయి.

 

వాస్తవానికి  ప్రతీ రోజూ టీ తాగితే ఎక్కువ రోజులు బతుకుతారు అని చైనీయులు ఎక్కువగా నమ్ముతారు అని సమాచారం. చైనా వారు  ఎక్కువగా టీని ఇష్టంగా తాగడం జరుగుతుంది. టీ కేవలం ఆరోగ్య పరంగానే మంచిది కాదు.. అందాన్ని కూడా బాగా మెరుగు పరుస్తుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇలా టీ తాగడం వల్ల వయసు తగ్గి.. శరీరం ముడతలు పడకుండా ఉండేలా చూస్తుకుంటుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. కాబట్టి అందరు రెగ్యులర్‌గా టీ తాగి చాల బ్యూటీ బెనిఫిట్స్ కలుగుతాయి అని  నిపుణులు చెబుతున్నారు.

 

నిజానికి ఒక కప్పుటీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. ఇక టీ తాగడం వల్ల ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం వంటి ఆరోగ్య సమస్యలను సులువుగా దూరం చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మీరు జలుబుతో బాధ పడుతుంటే ఓ కప్పు టీ చేసుకుని తాగండి. ఆ టీలో  కాస్త యాలకులు, అల్లం కూడా వేసుకోండి.. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందండి. టీ తాగడం వల్ల మనిషికి  ఒంటి నొప్పులు కూడా అధికమించవచ్చు అని నిపుణులు  అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం టీ తాగి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: