కాఫీ తో కలిగే లాభాలు....కాఫీలో ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గడం లో సాయం జరుగుతుంది. కాఫీ వల్ల మెంటల్ అలర్ట్‌నెస్ పెరుగుతుంది, ఫోకస్ చేయగలుగుతారు.కాఫీలో ఉన్న మెగ్నీషియం, పొటాషియం శరీరం ఇన్సులిన్ ని యూజ్ చేసుకోవడం లో హెల్ప్ చేస్తాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి, స్వీట్స్ మరియూ స్నాక్స్ మీద ఉండే క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తాయి.. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారు అకాలమరణం పొందే రిస్క్ ఇరవై ఐదు శాతం తక్కువని తెలుస్తోంది. కాఫీ కొన్ని కాన్సర్లని ప్రివెంట్ చేయగలదు. కాఫీ వల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. కాఫీ వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే రిస్క్ ఇరవై ఐదు శాతం తగ్గుతుంది.కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి.కాఫీ వల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గవచ్చు. కాఫీ వల్ల డిమెన్షియా, అల్జైమర్స్ వంటివి వచ్చే రిస్క్ తగ్గుతుంది.కాఫీ మంచి మూడ్ ని ఇస్తుంది, డిప్రెషన్ ని తగ్గిస్తుంది.
కాఫీ వల్ల కలిగే నష్టాలు...
పాలూ పంచదార కలిపి తాగే కఫీ ఎక్కువైతే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని నిపుణులు అంటున్నారు. కాఫీ ఎక్కువైతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి.గర్భవతులు రోజుకి ఒక కప్పు కంటే ఎక్కువగా కాఫీ తాగకుండా ఉండడం శ్రేయస్కరం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారు ఫిల్టర్ కాఫీని ఎంచుకోవాలి.కాఫీ పునరుత్పత్తి వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. కొంతమందికి కాఫీ ఎక్కువైతే యాంగ్జైటీ పెరుగుతుంది.బాడీలో ఉండే విటమిన్ బీ, మెగ్నీషియం లెవెల్స్ కాఫీ ఎక్కువైతే తగ్గిపోతాయి.చిన్న పిల్లల్లో కాఫీ తాగే అలవాటు పక్క తడిపే సమస్యని పెంచుతుందని తెలుస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి