కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి, స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశించడం అవసరం. అందుకే తరచుగా కొన్ని గంటల పాటు మన ఇంటి తలుపులు, కిటికీలన్నింటినీ తెరుస్తాము. దీంతో గాలితో పాటు దోమలు కూడా ఇంట్లోకి వస్తాయి. దీంతో రాత్రి పడుకునేటప్పుడు ఎంతమంది మస్కిటో కాయిల్స్ కాలుస్తారో తెలీదు కానీ అలా చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎంత రిస్క్ అనేది తెలుసా? అవును... దోమలను తరిమికొట్టే లేదా చంపే ఈ మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం. ఎందుకంటే ఇందులో హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇది శరీరానికి మంచిది కాదు.

మస్కిటో కాయిల్స్ ఎంత ప్రమాదకరమంటే?
మస్కిటో కాయిల్‌ను కాల్చడం వల్ల దాదాపు 75 సిగరెట్ల ఎక్కువ పొగను ఉత్పత్తి చేస్తాయి. ఇది మీకు, మీ కుటుంబానికి ప్రమాదకరం. ఒక నివేదిక ప్రకారం, దోమలను చంపే ఈ కాయిల్స్ నుండి విడుదలయ్యే పొగ... శ్వాసనాళంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగిస్తుంది. అడ్డంకిని కూడా కలిగిస్తుంది.ఇది శరీరానికి మంచిది కాదు.

మస్కిటో కాయిల్ ఎలా పని చేస్తుంది ?
మస్కిటో కాయిల్స్‌లో అనేక రకాల రసాయన పదార్థాల మిశ్రమం ఉంటుంది. అటువంటి మిశ్రమాలలో ఉండే పదార్థాలు మానవ శరీరానికి హానికరం.
ఇందులో రెండు రకాల రసాయన పదార్ధాలు ఉన్నాయి, అందులో ఒకటి క్రిమిసంహారక మందు దోమలను చంపుతుంది. మరొకటి సుగంధ పదార్థం (సిట్రోనెల్లా వంటివి) దోమలను తరిమివేస్తుంది.ఒక పరిశోధన ప్రకారం ఒక మస్కిటో కాయిల్ 100 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరం.

ఆరోగ్యానికి మస్కిటో కాయిల్ హాని కలిగించే ఏమిటంటే ?
1. ఆస్తమా
దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగించే మస్కిటో కాయిల్స్ ఆస్తమా వంటి సమస్యలను కలిగిస్తాయి. మనం కాయిల్ పొగలను ఎక్కువసేపు పీల్చుకుంటే, ఆస్తమా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అదే సమయంలో ఈ పొగ పిల్లల శ్వాసపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

2. కళ్ళు మరియు చర్మంపై ప్రభావాలు
మస్కిటో కాయిల్ నుండి వెలువడే పొగ మీ కళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: