ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణకు దక్కాల్సిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ... తాజా నిర్ణయంతో గుజరాత్‌కు చేరింది. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మొదట హైదరాబాద్‌లో నెలకొల్పాలని భావించారు. ఇప్పుడు ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లిపోతోంది. ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖే కొన్ని రోజుల క్రితం తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది.
కేంద్రం లేఖపై ఆనందపడిన తెలంగాణ దీనిపై ఏర్పాట్లు చేసుకుంటుండగానే కేంద్రం మళ్లీ నిర్ణయం మార్చుకుంది. తాజాగా కేంద్ర మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సమయంలో 2020 డిసెంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మొదట ఈ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ప్రస్తావన వచ్చింది. సంప్రదాయ వైద్యానికి పెరిగిన ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంస్థను ఇండియాలో ఏర్పాటు చేయాలని భావించింది.
ఆ సమయంలో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో సీసీఎంబీ, సీఎస్‌ఐఆర్, ఐఐటీ, డీఆర్‌డీఓ తదితర సంస్థలున్నాయి. అందువల్ల అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం పరిశోధనలకు అనువుగా ఉంటుందని భావించారు. ఇప్పుడీ తాజా నిర్ణయం తెలంగాణకు షాక్ అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి