ఇక ఈ రోజుల్లో చాలా మందిని ఎసిడిటీ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితిలో, మనం పుష్కలంగా నీటిని తాగాలి. ఎందుకంటే నీరు మన శరీరం నుండి విష పదార్థాలు (ట్యాక్సిన్లు)ను బయటకు పంపుతుంది. దీంతో పాటు నీటి శాతం ఎక్కువ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే ఇవి శరీరానికి చలువను తీసుకొస్తాయి. మరి వేసవి కాలంలో ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి.వేసవిలో మజ్జిగ అనేది ఒక వరం లాంటిది. ఇది శరీరానికి చలువనిస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన బ్యాక్టీరియా కడుపులో ఎక్కువ మొత్తంలో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది.అందువల్ల ఎసిడిటీతో పాటు, ఇతర ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇది దోహదపడుతుంది. వేసవి కాలంలో ఆహారం తిన్న తర్వాత కొంచెం మజ్జిగ తప్పనిసరిగా తాగాలి.కొబ్బరి నీళ్లలో ఆరోగ్య పోషకాలు చాలా ఉంటాయి. ఇవి శరీరంలోని నీటి కొరతను పోగొట్టి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అంతేకాదు కోకోనట్‌ వాటర్లో శరీరాన్ని డిటాక్సిఫై చేసే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ సమస్యని దూరం చేస్తాయి. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది.


వేసవి కాలంలో పండిన అరటిపండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం ఇంకా అలాగే ఫైబర్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. ఇక ఇందులో ఉండే పొటాషియం ఎసిడిటీ సమస్యని నియంత్రిస్తుంది. అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.వేసవిలో ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉంటే చల్లని పాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. వేసవిలో చల్లటి పాలు తాగడం వల్ల శరీరానికి చల్లదనంతో పాటు బర్నింగ్ ఇంకా అలాగే ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన పాలు బదులు సాధారణ చల్లని పాలను తాగితే ఒంటికి మంచిది.యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అలాగే ఫైబర్ యాసిడ్ రిఫ్లక్స్‌లో పుష్కలంగా ఉండటం వల్ల పుచ్చకాయ ఉదర సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.దీనిని తీసుకోవడం వల్ల బాడీ చాలా హైడ్రెటెడ్‌గా ఉంటుంది.గ్యాస్ ఇంకా అలాగే ఎసిడిటీ వంటి సమస్యలను నియంత్రించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: