ఈ సీజన్లో మనలో చాలా మంది దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలతో బాగా బాధపడుతున్నారు. కొంతమంది అయితే సీజన్ తో సంబంధం లేకుండా ఈ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అయితే ఇటువంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే చాలా మంది యాంటీ బయాటిక్ లను, మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు.అయితే వీటికి బదులుగా మనకు సులభంగా దొరికే పదార్థాలతో పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఈజీగా తగ్గడంతో పాటు ఊపిరితిత్తులు కూడా శుభ్రపడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం అంతా ఈజీగా తొలగిపోతుంది. ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఈ డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి..? ఇంకా దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి మనం పుదీనా ఆకులను, అల్లాన్ని ఇంకా పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో 10 నుండి 15 పుదీనా ఆకులు, ఒక అంగుళం అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఈ నీటిని ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇక నీరు గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి గ్లాస్ లో పోసిన తరువాత అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి కలిపి తాగాలి. ఇలా ఇంట్లోనే పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం కలుగుతుంది.ఇంకా ఈ నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది.ఊపిరితిత్తులు కూడా బాగా శుభ్రపడతాయి.ఇంకా అలాగే ఈ పానీయాన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు అర గ్లాస్ మోతాదులో, పెద్దలు ఒక గ్లాస్ మోతాదులో ఈ డ్రింక్ ని తీసుకోవ్చు. ఈ విధంగా ఇంట్లోనే ఈ డ్రింక్ ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇంకా మన ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: