ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఎన్ని చట్నీ లు ఉన్న కారం పొడులు కూడా ఉంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఫుల్ ఫిల్ అవుతుంది.ఈ పొడులు చాలా రకాలుగా చేసుకోవచ్చి, కొబ్బరి కార, పల్లీ కారం వెల్లుల్లి కారం, నల్లకారం,అవిసెగుంజలకారం,కాకర కారం, కరివేపాకు కారం, మునగ కారం,ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి వాటిల్లో పుట్నాలా పొడితో చేసిన కారం మీరు ఎప్పుడన్నా తిన్నారా, పుట్నాలు అంటే వేపుడుసెనగపప్పు.(వేరుశెననగ పప్పు వేరే, వేపుడుసెనగ పప్పు వేరే)ఈ వేపుడుసెనగపప్పుతో చేసిన కారం పొడి బలే రుచిగా ఉంటుంది.మరి దాని తయారీ విదానం చూద్దామా!


ఒక కప్పు వేపుడుసెనగపప్పు (పప్పులు ), ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర,రెండు చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.తర్వాత రెండు వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టుతీసి కచ్చాపాచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ సూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర,హాల్ఫ్ టీ స్పూన్ ఆవాలు,వేసి చిటపట లాడాకా, దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో కరివేపాకు, రెండు ఎండుమిర్చి,చిటికెడు పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడిలో వేయాలి. కొంచెం చల్ల బడ్డాక పప్పుల పొడిని చేత్తో బాగా కలిసేలా మొత్తం కలుకోవాలి.అంతే మంచి సువాసనతో ఘుమఘుమళాడే పప్పులకారం పొడి రెడీ.


దీన్ని దోస, ఇడ్లీ, ఉప్మా లోకి తింటే బలే రుచిగా ఉంటుంది. అంతేకాదు వేడి వేడి రైస్ లో కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. దీన్ని తరచూ చేసుకుని తినటం వల్ల శరీరంలో వేస్ట్ గా పేరుకుపోయిన క్రొవ్వుని కరిగిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు దీనిని తినటం వల్ల మోషన్ ఫ్రీ గా అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. అరుగుదల సమస్యలు ఉంటే వెంటనే నివారిస్తుంది.దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్.దీనికి సమయం కూడా సేవ్ అవుతుంది. మరి మీరు కూడా ఈ పప్పుల కారం పొడిని ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: