సాధారణంగా మనం స్వీట్ కార్న్, మొక్కజొన్నలు వంటివి చూస్తూనే ఉన్నాము. అయితే బేబీ కార్న్ అనేది కూడా చాలా రుచికరమైనవే.. ఇవి పూర్తిగా ఆకులతో చుట్టబడినట్టుగా ఉంటాయి. పురుగుమందుల ప్రభావం కూడా పెద్దగా ఉండదు.. బేబీ కార్న్ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్ ,ఐరన్ వంటివి చాలా సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఎలాంటి కొవ్వు లేకుండా ఫైబర్ కంటెంట్ మాత్రమే పుష్కలంగా లభిస్తుంది. ఇందులో కూడా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.


బేబీ కార్న్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్గా పిలుస్తారు. ఇది రోగనిరోధక వ్యవస్థను సైతం వెంటనే అందించడానికి సహాయపడతాయి. బేబీ కార్న్ మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి అవసరమైన సమయాలలో విటమిన్స్ ఖనిజాలు కూడా అందిస్తాయి



బేబీ కార్లలో డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు తినడం వల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను కూడా పెరగకుండా చేస్తుంది. జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడేవారు.. ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

బేబీ కార్న్ల ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణక్రియలో సహాయపడతాయి. సాధారణ ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహించడానికి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ బేబీ కార్న్ చాలా మంచిది.



బేబీ కార్న తినడం వల్ల చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఇందులో విటమిన్-c పుష్కలంక లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మ కణాలను సైతం పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి.. చర్మం మృదువుగా కనిపించిన కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తినాల్సిందే. ఇందులో ఉండేటువంటి ఫైబర్ కొలెస్ట్రాలను సైతం తగ్గించడానికి ఉపయోగపడుతుందట.

బేబీ కార్న్ లో కెరోటి నాయుడులు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. బేబీ కార్న్ లో పొటాషియం మరియు ఫైబర్ కలయిక ఉండటం వల్ల రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: