వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ సమయంలో ఎక్కువగా వేసవి నుంచి మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలను మనం పాటిస్తూనే ఉంటాము.. ముఖ్యంగా మన ఆరోగ్యం క్షీణించకుండా శరీరం చల్లబడుతుందని వేసవి తాపం నుంచి బయటపడడానికి పలు రకాల జ్యూసులు కూడా తాగుతూ ఉంటాము.. అయితే ఈ సమయంలో చాలామంది ఎక్కువగా తాగేటువంటి వాటిలో చెరుకు రసం కూడా ఒకటి.. చెరుకు రసంలో మెగ్నీషియం ,జింక్, ఐరన్ ,క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు..


చెరుకు రసం తరచు తాగడం వల్ల మనకు చాలా ప్రమాదం ఉంటుందట.. అందుకే చెరుకు రసం ఎక్కువగా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.


చెరుకు రసం తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అధ్యయనాలలో ఇందులోని క్యాలరీలు అధికంగా ఉండడం వల్ల చక్కెర స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఇది త్వరగా కలుస్తుందట. దీనివల్ల ఉబకాయం కూడా పెరుగుతుందని కొంతమంది పరిశోధకులు తెలియజేశారు.

చెరుకు రసంలో ఉండేటువంటి పాలికోసనల్ పదార్థం వల్ల రక్తాన్ని చాలా పలుచగా చేస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి రక్తం గడ్డ కట్టకుండా కూడా చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయమైనప్పుడు రక్తం కారుతుంది తప్ప గడ్డకట్టకుండా చేస్తుందట. అందుకే చెరుకు రసాన్ని ఎక్కువగా తాగకపోవడమే మంచిది.


యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండేటువంటి వాటిలో చేరుకు రసం కూడా ఉంటుంది అందుకే చెరుకు రసం కామెర్ల వ్యాధికి బెస్ట్ చికిత్స అని కూడా చెప్పవచ్చు అలాగే కాలేయాన్ని కూడా చాలా బలంగా ఉంచేలా చేస్తుంది. చెరుకు రసంలో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షిస్తాయి. అలాగే కామెర్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఇవి మన శరీరంలోని ప్రోటీన్ ని సైతం విచ్ఛిన్నం అయ్యేలా చేస్తాయి. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు. అంటే చెరుకు రసం ఎక్కువగా తాగడం కంటే తగిన మోతాదులలో తీసుకోవడమే ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: