మన చుట్టూ పరిసరాలలో దొరికేటువంటి పండ్లు ఆకుకూరలతోనే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా ఎన్నో రకాల పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు అందించే పనులు అందుబాటులోనే ఉన్నవి.. ముఖ్యంగా ఇందులో ఉసిరికాయలు కూడా ఒకటి.. ఇవి ఆరోగ్య ప్రయోజనానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఎన్నో సమస్యలకు సైతం ఉసిరిని ఉపయోగిస్తూ ఉన్నారు. వీటితో జ్యూస్ చేసుకొని తాగడం లేకపోతే ఊరగాయ చేసుకోవడం ఉసిరి పొడిని చేసుకొని తాగడం వల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి.రోజుకొక ఉసిరి పండును తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ఉసిరిలో పాలిఫెనాల్స్.. టానిన్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి.. ఇవన్నీ శరీరంలో హానికరమైనటువంటి ప్రీ రాడికల్స్ నుంచి బయటపడేలా చేస్తాయి.. రోజుకొక ఉసిరి పండు తినడం వల్ల శరీరంలో ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది. దీనివల్ల కణాల వినాశనం కూడా తగ్గుతుందట.. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు..


ఉసిరిలో ఉండేటువంటి విటమిన్-C  రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది.. అలాగే కీళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉసిరి చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు దివ్య ఔషధంగా పనిచేస్తాయి..

ఉసిరికాయను తింటూ ఉండడం వల్ల రక్తంలో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ ని కూడా నియంత్రిస్తుంది.. మధుమేహం ఉన్నవారు వీటిని తినడం చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ గా ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోస్ లెవ్స్ ను కూడా చాలా స్థిరంగా ఉంచేలా చేస్తుంది.


ఉసిరిని తినడం వల్ల మలబద్ధక సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. దీనివల్ల మలవిసర్జన కూడా చాలా సాఫీగానే వెళుతుందట.. దీనివల్ల అజీర్ణం ఉబ్బరం వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.


ఉసిరికాయ కొలెస్ట్రాల్ లేవాలను కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది రక్తప్రసరణ మెరుగు పరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.. ఇందులో ఉండేటువంటి యాంట్రీ ఇంప్లమెంటరీ లక్షణాలు హార్ట్ ఎటాక్ గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: