అరటిపండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు.అరటిపండును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అరటిపండ్లను తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. ఎముకలు గుళ్లబారడం, బోలు ఎముకలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అరటిపండు బీటా కెరోటీన్ ను కలిగి ఉంటుంది. బీటా కెరోటీన్ మన శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ మారుతుంది. కనుక అరటిపండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దృష్టి లోపాలు తగ్గుతాయి.కండరాల తిమ్మిర్లు, కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


అరటిపండ్లల్లో ఫ్రక్టోలిగోసాకరైడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి.అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. అరటిపండులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. అరటిపండ్లు ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో మనకు సహాయపడుతుంది.అందుకే ప్రతి రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మనం ఎల్లప్పుడూ ప్రశాంతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: