1. నిమ్మరసం కలిపిన నీరు ఉపయోగించడం
ఒక బౌల్‌లో శుభ్రమైన నీరు తీసుకుని అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఆ నీటిలో కట్ చేసిన ఆపిల్ ముక్కలను వేయాలి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆసిడ్ ఆక్సీకరణను తగ్గిస్తుంది. అందువల్ల ఆపిల్ ముక్కలు త్వరగా రంగు మారకుండా ఉంటాయి.ఇలా చేయడం వల్ల కొంచెం పుల్లని రుచి రావచ్చు కానీ అది ఆరోగ్యానికి హానికరం కాదు. పిల్లలకు ఇస్తున్నప్పుడు కడిగి పెట్టితే రుచి కూడా సాధారణంగా ఉంటుంది.
2. సోడా నీటిలో నానబెట్టడం
సోడా నీటిలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆపిల్ ముక్కలకు గాలి తాకకుండా చేస్తుంది. ఒక బౌల్‌లో సోడా నీరు తీసుకుని అందులో ఆపిల్ ముక్కలను సుమారు 5 నిమిషాలు నానబెట్టాలి. తరువాత బయటకు తీస్తే అవి చాలా ఫ్రెష్‌గా, కట్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తాయి. ఈ పద్ధతి ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్‌కు చాలా ఉపయోగకరం.
3. ఉప్పు నీటి పద్ధతి
ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు ఆపిల్ ముక్కలను అందులో వేసి కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి.తర్వాత వాటిని సాధారణ నీటితో కడిగి పెట్టాలి. ఉప్పు కూడా ఆక్సీకరణను తగ్గిస్తుంది. కడిగిన తర్వాత ఉప్పు రుచి ఉండదు, కానీ ఆపిల్ ముక్కలు రంగు మారకుండా తాజాగా ఉంటాయి.
4. చల్లటి నీటిలో ఉంచడం
కట్ చేసిన వెంటనే ఆపిల్ ముక్కలను చల్లటి నీటిలో ఉంచడం వల్ల కూడా గాలితో నేరుగా సంపర్కం తగ్గుతుంది. దీని వల్ల అవి ఎక్కువసేపు తెల్లగా, ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో కొద్దిగా పోషకాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది, అందుకే ఎక్కువసేపు ఉంచకపోవడం మంచిది.
5. గాలి చొరబడకుండా బాక్స్‌లో పెట్టడం
ఆపిల్ కట్ చేసిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో పెట్టి బాగా మూత పెట్టాలి. ఇలా చేస్తే గాలితో సంబంధం తగ్గి, ఆక్సీకరణ కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఇది కూడా చాలా సులభమైన, ఉపయోగకరమైన మార్గం.
ఆపిల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ఆపిల్‌లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాంక్రియాస్ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని మంట, తాపం తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలం ఆకలి వేయకుండా శక్తిని ఇస్తుంది.అందుకే రోజూ ఒక ఆపిల్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలైనా, పెద్దలైనా అందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన పండు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి