గత కొన్నేళగా ప్రజలు ఎక్కువగా మొబైల్ ఫోన్లకే వ్యాసనంగా మారిపోతున్నారు. ఏ ఉద్దేశం లేకుండా కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ కేవలం బ్రౌజింగ్ చేస్తూనే గంటల తరబడి తన మొబైల్స్ లో సమయాలను గడిపేస్తున్నారు. అయితే మొబైల్ ని ఎక్కువగా చూడడం వల్ల పలు రకాల జబ్బులకు దారితీస్తుందని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి మొబైల్ ని ఎక్కువగా చూడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



యువత అధిక స్క్రీన్ సమయం చూడడం చాలా ప్రమాదానికి దారితీస్తుందని తెలియజేస్తున్నారు. రోజులో ఆరు గంటలకు పైగా స్క్రీన్ చూడడం వల్ల అధిక రక్తపోటు, ఉభకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ డేటాను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ సైంటిఫిక్ సైంటిస్టులు తెలియజేశారు.ఈ పరిశోధనలు 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారిని కొందరిని తీసుకొని 6 గంటలకంటే ఎక్కువ స్క్రీన్ సమయం గడిపే వారిని పరిశీలించగా వారిలో రక్తపోటు ఎక్కువగా ఉందని, తక్కువ స్క్రీన్ సమయం గడిపే వారిలో చాలా తక్కువగా రక్తపోటు ఉందని పరిశోధనలు తేలింది.


అలాగే చెడు కొలెస్ట్రాల్ వ్యత్యాసం ఉందని, ఒక వ్యక్తి ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఉభకాయం కూడా వస్తోందని ఇది అధిక కొలెస్ట్రాలను పెంచేలా చేస్తుందని తెలియజేశారు. దీనివల్ల గుండె జబ్బులకు దారితీస్తోందని, పరిశోధకుడు జైన్ ఇస్లాం మాట్లాడుతూ ఎక్కువ స్క్రీన్ సమయానికి అలవాటు పడ్డవారు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారని దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోందని తెలియజేస్తున్నారు. శారీరక వ్యాయామం కూడా చేయని వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అందుకే నిపుణులు సైతం ప్రజలను మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూసే చూసేవారు వాటిని తగ్గించుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. మరి ఇకనైనా మొబైల్ చూసే వారి సంఖ్య తగ్గుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: