గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్‌22వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం..

ముఖ్య సంఘటనలు


1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్‌లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.
1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
1966: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.
1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
1981: పారిస్-లియాన్‌ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.
2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.

జననాలు

1894: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు.కోలవెన్ను రామకోటేశ్వరరావు, (1894- 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకులు.ఇతను బందరు నుండి వెలువడిన 'త్రివేణి' అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించాడు .ఇతను గుంటూరు జిల్లా నరసారావుపేటలో 1894 సంవత్సరం అక్టోబరు 22న జన్మించాడు. న్యాయశాస్త్ర పట్టభద్రులై, కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసిన, పిదప జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తరువాత ప్రిన్సిపాల్ గాను పనిచేశాడు.1930లో ఉప్పు సత్యాగ్రహం లోను, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని చెరసాలకు వెళ్ళాడు
1901: కొమురం భీమ్ హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)
1927: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత


మరణాలు

1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896)

మరింత సమాచారం తెలుసుకోండి: