తల్లితండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుంది అని పూర్వీకులు చెబుతుంటారు.  అయితే దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందువలన పిత్రుశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది.

 

ఆడా, మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే, ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాల క్రమేనా అవయవాలు పాడవడం జరుగుతుంద‌ని కొంత మంది పండితులు చెబుతున్నారు. దానినే "వంశపార్యపరం" అంటారు. అందుకే మనం వయసులో "ధర్మoగా" ఉంటే, మనకు పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు.

 

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లలు జీవితంలో వృద్ది ఉండదు. పిల్లలను చూసి తల్లితండ్రులు భాద, మనస్తాపానికి గురవుతారు. నిజానికి ఆనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే ఆధికంతా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: