దూరం: ఇది కవర్ చేసే మొత్తం దూరం దాదాపు 4,200 కిలోమీటర్లు (4189 కి.మీ.).
సమయం: ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 74 నుంచి 80 గంటలు (నాలుగు రోజులు) పడుతుంది.
రాష్ట్రాలు: ఈ ప్రయాణంలో ఈ రైలు ఏకంగా 9 రాష్ట్రాల మీదుగా వెళుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలంటే కేవలం టికెట్ ఉంటే సరిపోదు.. సహనం కూడా కావాలి. రైల్వే స్టేషన్లలో ఈ రైలు 50 నుంచి 59 చోట్ల ఆగుతుంది. అంటే, ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడమే కాదు, భారత దేశం యొక్క విభిన్న భౌగోళిక రూపాన్ని చూపుతుంది. అస్సాం తేయాకు తోటల నుంచి దట్టమైన అడవులు, మైదానాలు దాటుతూ చివరకు కన్యాకుమారి తీరాన్ని చేరుకునే ఈ జర్నీ... ప్రయాణికులకు ఒక అవిస్మరణీయ అనుభూతిని ఇస్తుంది.
మరోవైపు, ఇంత సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఇందులో ప్రయాణించేవారు ఎదుర్కొనే కష్టాలు కూడా తక్కువేం కాదు. అందుకే కొందరు నెటిజన్లు దీనిని 'సహనం పరీక్షించే ఎక్స్‌ప్రెస్' అని సరదాగా కామెంట్లు చేస్తుంటారు. అయినా సరే, దేశంలోని అత్యంత చారిత్రక ప్రాంతాలను చూపిస్తూ, కోట్లాది మందికి సేవలు అందిస్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్.. భారతీయ రైల్వే గర్వకారణంగా నిలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి