పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాలు ఉపకరిస్తాయి. అంతటి విలువైన టీకాలను కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నా అవగాహనాలోపంతో చాలా మంది వినియోగించుకోలేక పోతున్నారు.  పిల్లల నిండు జీవితానికి రెండు చుక్కలు. పోలియో వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నినాదం ‘వ్యాధి వచ్చాక నివారణ  కోసం ప్రయత్నించే కంటే ముందస్తు జాగ్రత్త మేలు’ సూత్రం నుంచి ఉద్భవించిందే టీకా మందు. టీకామందులన్నింటికీ ఈ నినాదాం అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎన్నో రకాల వ్యాక్సిన్‌లు సకాలంలో చిన్నారులకు వేయించడం ద్వారా పలు రోగాల నుంచి దూరం చేయవచ్చు.

 

 

 

ఆ కారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచితంగా టీకా మందులు వేయిస్తున్నాయి. టీకా మందు ప్రాముఖ్యతను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రెండు చుక్కల మందు ప్రాణాంతక వ్యాధిని దూరం చేస్తుంది. టీకా మందు అంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వ్యాక్సిన్‌. చిన్న వయస్సులోనే పిల్లలు వేగవంతంగా రోగాలు ఆశ్రయిస్తాయి.

 

పిల్లలు పుట్టుకతోనే సమస్యలు వెంట తెచ్చుకుంటారు. వాటికి ఆదిలోనే అంతం పలికేందుకు ఉద్దేశించిందే టీకా మందు. క్షయ, కంట సర్పి, కోరింతదగ్గు, పోలియో, ధనుర్వాతం, తట్టు, కామెర్లు, మెదడు వాపు, నిమోనియా వంటి రోగాల రక్షణకు టీకా ఉపయుక్తం.పుట్టిన 6,10,14 వారాల తర్వాత నోటి ద్వారా 5 చుక్కలు చొప్పున ఈ మందు వేస్తారు. ఇది విరోచనాలు నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇంకా పెంటావ్యాలెండ్‌, మీజిల్‌ టీకా, మిటమిన్‌ ఏ ద్రావణం, బూస్టర్‌ డోస్‌లను 24 నెలలు లోపు వయస్సు వచ్చే వరకు చిన్నారులకు ఇవ్వాలి.వ్యాక్సినేషన్‌పై తల్లిదండ్రులు అవగాహన తప్పనిసరిగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

ప్రభుత్వం అందిస్తున్న టీకాలు గురించి చిన్నారులను, తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి వైద్యులను సంప్రదించాలి. జ్వరం, దగ్గు ఉన్నప్పుడు టీకాలు వేయించకూడదు. సాధారణంగా ఎన్ని టీకాలనైనా పిల్లలకు ఇవ్వవచ్చు. టీకాలు వేయించిన అరగంట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దే ఉండటం మంచిది. ఎలాంటి ప్రతికూల చర్య కనిపించిన తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: