పిల్లలను ఆడుతూ పాడుతూ పెంచాలి.అలా అని వారిని వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేయకూడదు. పిల్లల్ని గారాబం చేయాలి. అంతేకానీ, వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలి.ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడం,స్నానం చేయడం అలాగే వాళ్ళ బ్యాగ్ లో వల్లే పుస్తకాలు చదురుకోవడం వంటివి నేర్పించాలి. తల్లితండ్రులు ముందుగా గమనించాలిసిన విషయం ఏంటంటే ప్రతీ చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.
ముందుగా పేరెంట్స్ దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒక వేళ అలాంటివేం పిల్లల్లో మనం గుర్తించకపోతే. వారికి ఏం ఇష్టమో.. తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. అంతేగాని మన ఇష్టాలను వాళ్ళ మీద రుద్దకూడదు. పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో. తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదే విషయం పేరెంట్స్ గుర్తు పెట్టుకుని పిల్లలు చదివేందుకు చక్కని వాతావరణం కలిగించాలి. వారికి చదువు ఎంత అవసరమో, ఆటపాటలు కూడా అంతే అవసరం.. ఇది వారి శారీరక, మానసిక వృద్ధికి దోహదం చేస్తుంది.పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి..
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి