చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు.అందుకని  పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అల్లా ఎదో ఒక టాబ్లెట్స్,టానిక్స్ లాంటి మందులు వేస్తూ ఉంటాము.ఆ మందుల వల్ల  పిల్లల ఆరోగ్యం నయమవుతుంది.కానీ మందులు ఇచ్చేటప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లలు కొన్ని  ప్రమాదాలకు, కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలిసి వస్తుంది. అందుకే పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు చాలా మంది తల్లితండ్రులు చేసే తప్పులు ఏంటో తెలుసుకుందాం.. !!

డాక్టర్ రాసి ఇచ్చిన చీటి ప్రకారం మందులు  పిల్లలకు వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైన తప్పు జరిగి ఉండచ్చు. మందుల షాపులో ఏదైనా తప్పు మందులు ఇచ్చారేమో, లేదా పిల్లల్ల మందులు వేరే మందులతో కలిసిపోయాయేమో అని ఒక్కసారి చూసుకోండి. అలాగే మందుల మీద ఎక్స్ పైరీ డేట్ దాటిపోయిందేమో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకున్న తర్వాత పిల్లలకు మందులు వేయండి.తర్వాత ఏ తప్పు జరిగినా నష్టపోయేది మన పిల్లలే. కొంతమంది పిల్లలకు సాధారణంగా చేసే జలుబుకు కూడా నాలుగు రకాల టాబ్లెట్స్ , రెండు రకాల టానిక్స్ వాడేస్తుంటారు. పిల్లలకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి చిన్న సమస్యలకు మందులు అతిగా వాడకండి.అలాగే ఏ సమయంలో, ఏ మందులు వేయాలి అన్నది డాక్టర్ చెప్పినట్టు మాత్రమే జరగాలి.

 అలాకాకుండా పిల్లలకు మీకు వీలున్నప్పుడు మందులు వేయకండి.పిల్లలకు  మందులు ఎక్కువ డొసేజ్ లో వేయడం చాలా చాలా ప్రమాదకరం. ఏ జబ్బుకు సంబంధించిన మందును ఆ జబ్బు వచినపుడే వాడాలి. అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలున్నపుడు ఒకరికి వాడిన మందులనే ఇంకొకరికి వాడకూడదు. పిల్లల వయసును బట్టి వాడే మందులు, వేయాల్సిన డొసేజ్ మారచ్చు.చాలా మంది కొన్ని జబ్బులకు సొంత వైద్యం వాడుతారు. అంటే వాళ్ళకు తెలిసిన ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఇలానే పిల్లల విషయంలో చేయకండి.పిల్లలకు వాడే మందులు ఎక్కడంటే  అక్కడ పెట్టకండి. ఎక్కువ వేడి లేదా చలి ఉన్నపుడు మందులు పాడయిపోతాయి. కొన్ని మందులు రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి, కొన్ని కూల్ టెంపరేచర్ లో ఉండాలి.ఎటువంటి ఇబ్బంది వచ్చిన ముందుగా డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: