మారుతున్న కాలంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా చాలా మారాయి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మలబద్ధకం సమస్య అందరికీ వస్తోంది. చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ తీవ్రం రూపం దాల్చుతోంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు మలబద్ధకం ఏర్పడుతుంది. చిన్నపిల్లల్లో మలబద్ధకం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతారు. అందుకే పిల్లలకు అజీర్తి వచ్చినప్పుడు ఈ చర్యలు తీసుకోవాలి.

చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్యను ఈజీగానే కనుగొనవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడే చిన్నారులు నిద్రపోవడానికి ఇష్టపడరు. వారానికి మూడు సార్లు మాత్రమే టాయిలెట్‌కు వెళ్లడం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలకు మలబద్ధకం ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. అయితే పిల్లల్లో మలబద్ధకం పెద్ద సమస్యే కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 39శాతం మంది పిల్లలు అజీర్తితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

2-3 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్లో మలబద్ధకం సాధారణ సమస్య. సాధారణంగా ఈ కాలంలో పిల్లలు సొంతంగా టాయిలెట్ వెళ్లేలా తల్లిదండ్రులు నేర్పుతుంటారు. అప్పుడే ఈ మలబద్ధకం సమస్యను గుర్తించినట్లయితే తల్లులకు ఒక సవాల్‌గా మారుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే గౌట్, బిఫిడో బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు ఉత్పన్నమై ఆహారాన్ని జీర్ణం చేసేందుకు తోడ్పడతాయి.

మనిషి యొక్క భావోద్వేగాలను సేరోటోనిన్ అనే హార్మోన్ నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ 95 శాతం ప్రేగులోనే ఉంటుంది. అయితే తినే ఆహారం జీర్ణమైనప్పుడే 70శాతం వరకు రోగనిరోధక శక్తి వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. చిన్నపిల్లలకు మలబద్ధక సమస్య ఏర్పడినప్పుడు మరుగుదొడ్డికి వెళ్లే అలవాటు నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంది. అప్పుడు తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. పిల్లల ఆహారంలో ఎక్కువ నీరు, జ్యూసులు ఉండేలా చూసుకోవడం ఉత్తమం. పోషకాలు కలిగిన ఆహారాన్ని రసాల రూపంలో అందించడం ద్వారా జీర్ణవ్యవస్థ తొందరగా పనిచేస్తుంది. ఓకేసారి భారీ మొత్తంలో పిల్లల కడుపు నింపకుండా.. కొంచెం కొంచెంగా తినిపించడం అలవాటు చేసినట్లయితే ఎలాంటి సమస్యలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: